చిట్టీల వ్యాపారం నిర్వహించిన హెడ్‌మాస్టర్ సస్పెన్షన్….
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా ప్రతినిధి జూన్ 12 2026: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం శర్భాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బెక్కం వీరయ్యపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తు మోసాలకు పాల్పడుతున్నాడని చింతపల్లి మండలం కుర్మపల్లి పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించారు. రూ.20 లక్షల చిట్టీ వ్యవహారంపై...