POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:07 am Posted by : POLITICAL POWER

చిత్తూరు జిల్లా రామకుప్పంలో మాజీ సర్పంచ్ బి. మోహన్ నాయక్‌పై దాడి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ చిత్తూరు జిల్లా బ్యూరో జులై 22 2026: ప్రసాద్ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన గిరిజన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు బి. మోహన్ నాయక్ పై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. బాధితుడి వర్గం తెలిపిన వివరాల ప్రకారం, గుట్టూరు తండాకు చెందిన కొందరు వ్యక్తులు రాడ్లు, కత్తులతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ దాడి నుంచి మోహన్ నాయక్ ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ విభేదాల నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు.