POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 9:14 pm Posted by : POLITICAL POWER

చిలకటోనిపల్లిలో ముమ్మరంగా ఇంటింటి సర్వే

లెక్కల కోసం కుటుంబ వివరాలు నమోదు చేస్తున్న అధికారులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 15 2026: పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలో జనాభా లెక్కల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. జనాభా లెక్కలలో భాగంగా గురువారం రోజు ఎన్యూమరేటర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించారు. గ్రామ సర్పంచ్ ఎం అశ్విత రమేష్ ఉప సర్పంచ్ మందాపురం చిన్నరాములు ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు కృష్ణయ్య, ఎన్ రమేష్ పాల్గొని నిర్వహించారు.

 ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… గ్రామ ప్రజలు ఇంటింటి సర్వేకు పూర్తి సహకారం అందించాలని కోరారు. కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం తదితర వివరాలను సరైన విధంగా అందించి జనాభా లెక్కల సర్వేను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ప్రజల సంఖ్య, కుటుంబాల వివరాలు, అవసరాలపై స్పష్టమైన సమాచారం అందించడంలో ఈ సర్వే కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి వివరాలను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.