POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 11:37 am Posted by : POLITICAL POWER

చిల్కటోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహణ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 3026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిల్కటోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఎం. అశ్విత ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా చిన్నారులకు విద్యారంభం చేయిస్తూ అక్షరాభ్యాసం నిర్వహించారు. విద్య ప్రతి చిన్నారి జీవితానికి బలమైన పునాది అని, చిన్నప్పటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని సర్పంచ్ ఎం. అశ్విత సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ఉపాధ్యాయురాలు భారతి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు జి. మంజుల, గ్రామ మహిళలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు ఆశీర్వాదాలు అందజేసి వారి విద్యాభ్యాసం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా జరిగింది.