చీకరుచెట్టు తండాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: పెద్దమందడి మండల పరిధిలోని చీకరుచెట్టు తండాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంగోత్ లలిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తండా ప్రజలు, బంజారా సేవా సంఘం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని కొలిచారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, యువత...