చుక్కనీటి కోసం విద్యార్థుల పోరాటం.. దమ్మపేట ట్రైబల్ హాస్టల్ లో నీటి కష్టాలు

ట్రైబల్ హాస్టల్ లో మూడు రోజులుగా నీళ్లు బంద్ గిరిజన హాస్టల్ లో తాగునీటి కష్టాలు - స్పందించిన అధికారులుపొలిటికల్ పవర్, సెప్టెంబర్ 09:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని గిరిజన వసతి గృహంలో విద్యార్థులు చుక్కనీటి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. గత మూడు రోజులుగా వసతి గృహంలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.బోరు మోటారు పాడవ్వడంతో పాటు మిషన్ భగీరథ నీరు కూడా రాకపోవడంతో తాగునీటికి, స్నానాలకు, మరుగుదొడ్లకు, బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీరు లేక విద్యార్థులు...