
శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్):
శ్రీశైల దేవస్థానం పరిధిలోని మల్లమ్మ కన్నీరు వెనుక భాగంలో నివాసముంటున్న చెంచు గిరిజనుల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడులకు కొమరం భీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం మరియు స్థానిక గిరిజన మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు వై. ఆశీర్వాదం మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా సుమారు 20 చెంచు కుటుంబాలు అక్కడ నివాసముంటున్నాయని తెలిపారుతాగునీటి సమస్యపై ఐటీడీఏ (ITDA) అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల తమ మంచినీటి కష్టాలను దేవస్థానం ఈవో దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగానే వారు తక్షణమే స్పందించారని పేర్కొన్నారు. దేవస్థానం సిబ్బందిని అక్కడికి పంపించి, తాగునీటి కుళాయిని ఏర్పాటు చేసి తమ ఏళ్ల నాటి సమస్యను తీర్చారని కొనియాడారు.
సమస్య వినగానే స్పందించి నీటి సదుపాయం కల్పించినందుకు గిరిజన మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, వీరమ్మ, వీరన్న, మూగమ్మ, దేవయ్య, వెంకటేశం, మంతయ్య, వెంకటమ్మ తదితర చెంచు గిరిజనులు పాల్గొన్నారు.