చెంచుల మంచినీటి సమస్య తీర్చిన శ్రీశైల దేవస్థానం అధికారులు * ఈవో ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడుకి గిరిజనుల ధన్యవాదాలు * స్పందించి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయించిన దేవస్థానం
శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్): శ్రీశైల దేవస్థానం పరిధిలోని మల్లమ్మ కన్నీరు వెనుక భాగంలో నివాసముంటున్న చెంచు గిరిజనుల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడులకు కొమరం భీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం మరియు స్థానిక గిరిజన మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు వై. ఆశీర్వాదం మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా సుమారు 20 చెంచు కుటుంబాలు అక్కడ నివాసముంటున్నాయని తెలిపారుతాగునీటి...