చెంచు గిరిజనుల మంచినీటి సమస్య తీర్చిన శ్రీశైల దేవస్థానం ఈవో, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్: గిరిజన మహిళల హర్షం!

నంద్యాల జిల్లా, శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్): శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు గిరిజనుల తాగునీటి తిప్పలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వెనుక భాగంలో నివాసముంటున్న 20 చెంచు గిరిజన కుటుంబాలు గత రెండేళ్లుగా తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యపై స్పందించిన శ్రీశైల దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు తక్షణమే తాగునీటి కుళాయిని ఏర్పాటు చేయించి గిరిజనుల దాహార్తిని తీర్చారు. అధికారులు పట్టించుకోకున్నా స్పందించిన ఈవో, చైర్మన్: గతంలో ఐటీడీఏ...