POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 12:40 pm Posted by : POLITICAL POWER

చైర్మన్, వైస్ చైర్మన్ ఆదేశాలతో రంగంలోకి జూపల్లి ప్రమోద్.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన!* ప్రజల ఇబ్బందులపై ఆరా.. రోడ్లు, డ్రైనేజీల శుభ్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన

:పొలిటికల్ పవర్ ప్రతినిధి  అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి ప్రమోద్ ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి, తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా గౌడ్ బజార్, మంగళ బజార్, సంత మార్కెట్ ఏరియా, వడ్డెర బజార్, దొంతికుంట, అంబేద్కర్ నగర్, చిన్నంశెట్టి బజార్, నిమ్మల బజార్, తూర్పు బజార్, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని, డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేయాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు.

భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జూపల్లి ప్రమోద్ వెంట హ్యాట్రిక్ కౌన్సిలర్ మిండా హరిబాబు, దండా బత్తుల రమేష్, అశ్వరావుపేట మున్సిపల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పసుపులేటి ఫణీంద్ర (నాని) తదితరులు పాల్గొన్నారు.