పలుస శంకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు, సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లా
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రకాష్ శాస్త్రి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తాటిపాముల గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే చౌడేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోట పుల్లయ్య, కృష్ణయ్య, రాము గోపాల్, డా. నారాయణ, రాజశేఖర్, నవీన్, జానకిరాములు, నర్సింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.