ఛత్రినాక–బోయిగూడ రహదారిలో ఇనుప కరెంటు స్తంభాలు తొలగించి రోడ్డు విస్తరించాలి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 11 2026: హైదరాబాద్ ఛత్రినాక చౌరస్తా నుంచి బోయిగూడ వైపు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి, రహదారిని విస్తరించాలని తెలంగాణ ఉద్యమకారుల పోరం కన్వీనర్ గడ్డమీది హరినాథ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఛత్రినాక చౌరస్తా మీదుగా ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్, కందికల్ రోడ్డు,...