పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక – పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో : పసుపులేటి ఉమాశంకర్: జాతీయ జెండా రూపకర్త, మహనీయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని సత్యనారాయణపురం, శ్యామల థియేటర్ ఎదురుగా ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పింగళి వెంకయ్య విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షులు, వైశ్యరత్న గౌరవ డాక్టరేట్ గ్రహీత చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ కొండ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు, జగ్గయ్యపేట బాయ్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్ కొత్త పురుషోత్తం, పారేపల్లి గురువులు, ఘంటసాల ఆరాధన కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఓరుగంటి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అతిథులు పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి, దేశానికి విశిష్ట సేవలందించిన పింగళి వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… భారత జాతీయ జెండా రూపకల్పన ద్వారా పింగళి వెంకయ్య దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని, యువత ఆయన దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది.