జనసేన ఎమ్మెల్యేకు బిగ్ షాక్: బత్తుల రామకృష్ణ భార్యపై వైఎస్సార్సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు ఘన విజయం!
సీతానగరం/తూర్పుగోదావరి: పొలిటికల్ పవర్ ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీతానగరం జెడ్పీటీసీ ఎన్నికల సమరంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణకు సీతానగరం ప్రజలు కోలుకోలేని షాకిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే భార్య వెంకటలక్ష్మిని బరిలోకి దించి, అధికార-ఆర్ధిక బలాలను నమ్ముకుని అక్రమాలతో గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసినా.. సీతానగరం తీర్పు ముందు ఏ అహంకారమూ నిలవలేకపోయింది! వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు గారు ఏకంగా 2,600 ఓట్ల భారీ మెజార్టీతో అలవోకగా విజయం సాధించి, ఫ్యాన్ గాలి పవర్...