*జర్నలిజం అంటే గుర్తింపు కార్డు కాదు.. ఒక సామాజిక బాధ్యత: అక్రెడిటేషన్ సమస్యపై జాతీయ కార్యదర్శి కుర్రే రాజేంద్రరెడ్డి ధ్వజం!*

ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమైన జర్నలిజం రంగంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని వీడాలని జర్నలిస్టు సంఘాల జాతీయ కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రస్తుత అక్రెడిటేషన్ నిబంధనల వల్ల ఎంతోమంది నిజమైన, కష్టపడే పాత్రికేయులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ.. కేవలం పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసే వారికే కాకుండా, గ్రామీణ, మండల స్థాయిల్లో నిరంతరం శ్రమిస్తున్న చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ గుర్తింపు...