లంచం తీసుకుంటు ఏ.సి.బి. కి చిక్కి సస్పెండ్ అయినా సబ్ రిజిస్టార్ తుమ్మ కొమ్మ సుచరిత.
30లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేసులో సస్పెండ్ అయినసుచరిత పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు.
పొలిటికల్ పవర్ ప్రతినిధి మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ పాండు రంగారావు కీసర సర్కిల్ జవహర్‌నగర్ జూన్ 26 2026: కాప్రా తహసీల్దార్ (ఎమ్మార్వో)గా పనిచేసిన సమయంలో జవహర్ నగర్ భూ వివాదాలకు సంబంధించిన అంశాల్లో అనేక మంది అమాయక ప్రజలపై ఆధారాలు లేని కేసులు నమోదు చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ కేసుల కారణంగా ఎన్నో కుటుంబాలు సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొంటున్నారు. ఇటీవల రూ.30 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కిన సబ్-రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఇప్పటికే సస్పెన్షన్ చర్యలు తీసుకోగా, అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల (డి.ఏ.) కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆమె కాప్రా మండల ఎమ్మార్వోగా పనిచేసిన కాలంలో జవహర్‌నగర్‌లో జరిగిన భూ వ్యవహారాలు, నమోదైన ఫిర్యాదులు, పోలీసు కేసులపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఏసీబీ దర్యాప్తులో సుచరితకు చెందినట్లు గుర్తించిన ఆస్తుల్లో సిద్దిపేట జిల్లాలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లు, సుమారు రూ.1.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ.12 లక్షల నగదు, రూ.38 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.5.05 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె హయాంలో నమోదైన భూ వివాదాలకు సంబంధించిన కేసులను స్వతంత్రంగా పునఃసమీక్షించి, ఆధారాలు లేకుండా లేదా తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కేసులు ఉంటే వాటిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా కొట్టివేయాలని జవహర్‌నగర్ ప్రజలు ప్రభుత్వంనికి , రెవెన్యూ శాఖకు, పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.