పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, మరియు రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు శివకుమార్ జాతీయ ముఖ్య సలహాదారు దండి వెంకట్, జాతీయ వడ్డెర సంఘం ( జే వి ఎస్ ) జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ అన్న ఆధ్వర్యంలో నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు రేపని నర్సింలు అధ్యక్షతన నిజామాబాదు -కామారెడ్డి ఉమ్మడి జిల్లాల (అవగాహన సదస్సు) ముఖ్య కార్యకర్తల సమావేశం సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతితులుగా జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ , జాతీయ ముఖ్య సలహాదారు దండి వెంకట్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు ఎత్తరి రాములు, మల్లె కృష్ణ మరియు జాతీయ వడ్డెర సంఘం టీం హాజరవడం జరిగింది. ముందుగా జాతీయ వడ్డెర సంఘం వ్యాపస్థాపక అధ్యక్షుడు కీర్తి శేషులు వేముల వెంకటేష్, నిజామాబాద్ జిల్లా జాతియా వడ్డెర సంఘం మాజీ అధ్యక్షుడు కీర్తి శేషులు ఒళ్లెపు శంకర్ల కు ఘనంగా నివాళులు అర్పించి సభను ప్రారంభించటం జరిగింది. నిజామాబాదు -కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో జరిగిన మీటింగ్ లో చాలా మంది వక్తలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ అన్న మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు కూడా అన్ని విషయాలలో కూడా వడ్డేరులకు అన్యాయమే జరిగిందని, ఏ ప్రభుత్వం వచ్చిన వడ్డేరులకు చేసింది ఏమీ లేదు అన్నారు. జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో “మార్పు దిశగా ప్రయాణం” అనే కొత్త కాన్సెప్ట్ తో “మేమెంతో మాకు అంతా” అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము అన్ని చెప్పడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఎస్టి సాధన అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి వడ్డెర కు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ స్కీమ్ లు, సబ్సిడీ లు జనాభా ప్రతి పాదికన మనకు అందాలి అన్నారు. ప్రతి వడ్డెర కు నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత కార్పొరేట్ వైద్యం, సామాజిక భద్రత, ప్రభుత్వం నుండి సబ్సిడీలతో కూడిన ఆర్ధిక సహాయం, రాజకీయ అవకాశాలు అందాలి అని జాతీయ వడ్డెర సంఘం పోరాటం చేస్తుందని పిట్ల శ్రీధర్ తెలియ చేశారు. మేము ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి కూడా అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు అని ఇక నుండి మా గురించి అనుకూలంగా వుండే పార్టీలకు మేము అనుకూలంగా పనిచేస్తామని, మమ్మల్ని పట్టించుకోని పార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తామని చెప్పారు…రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు , ఎంపీ లు కావాలంటే మన ఓట్లు చాలా కీలకమని, మనం యూనిటీ గా వుంటే అన్ని సాధించుకోవచ్చని పిట్ల శ్రీధర్ అన్న తెలియచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మన కులం గురుంచి, మన గురుంచి అసెంబ్లీ లో మాట్లాడడానికి ఏ ఒక్క నాయకుడు లేకపోవటం చాలా బాధాకరం అని, రాజకీయ పార్టీలు మనల్ని ఓట్లు గా వాడుకుంటున్నాయి కానీ సీట్లు ఇవ్వటం లేదని ఇక మీదట మనకు కూడా రాజ్యాధికారంలో వాటా కావాలని ఒక్కో రాష్ట్రంలో కనీసం ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యే లు మన వారు కావాలని ఆ దిశగా సంఘాలకు అతీతంగా రెండు రాష్ట్రాల్లోని మనం అందరం కూడా పని చేద్దాం అని పిట్ల శ్రీధర్ తెలియచేయటం జరిగింది. జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వెయ్యడం జరుగుతుందనీ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వడ్డెర్లకు ఎక్కడ అన్యాయం జరిగిన, అవమానం జరిగిన జాతీయ సంఘం అండగా ఉంటుంది అన్ని చెప్పటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ మాట్లాడుతూ నిజామాబాదుతో నాకు చాలా అవినావా బావ సంబంధం ఉందని ఇక్కడ ప్రజలు గుండెలు హత్తుకొని చూస్తారని తెలిపారు. విద్య అనేది ప్రతి ఒక్కరికి అందాలి అని తెలిపారు…ఉచితంగా లేబర్ కార్డు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అన్ని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి వడ్డెర బిడ్డకు గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నట్టు తెలంగాణలో కూడా వడ్డేరులకు మైనింగ్ లో రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. పిట్ల శ్రీధర్ నాయకత్వంలో జాతీయ వడ్డెర సంఘం చాలా బలోపేతం అయింది అన్నారు. జాతీయ ముఖ్య సలదారులు దండి వెంకట్. మాట్లాడుతూ వడ్డెర్లు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, మనకు సమాజంలో గుర్తింపు రావాలని, మనం కూడా రాజకీయాలలో ప్రధాన భూమిక పోషించాలనిఅన్నారు…అధికారంలో లేని జాతులు అంతరించిపోతున్నాయని, మనకు కూడా రాజ్యాదికారంలో వాటా రావాలని, మన హక్కులు సాధించుకునే వరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలని పోరాడితే పోయేదేముందీ బానిస సంకెళ్లు తప్ప అని చెప్పారు. తదనంతరము అతిథులకు నిజామాబాద్ జిల్లా సంఘం తరుపున పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అన్న తో పాటు రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్, జాతీయ ముఖ్య సలహాదారులు దండి వెంకట్, జాతీయ నాయకులు ఎత్తరి రాములు, మల్లె కృష్ణ, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేపని నర్సింలు, చెల్లా ఎల్లయ్య, బత్తుల శంకర్, సంపంగి శంకర్, రాష్ట్ర నాయకులు జరుపటి రాజు , గోగుల రమేష్ , కొడగంటి కృష్ణయ్య, ముద్దంగుల గిరి, యాదగిరి సర్, గొడ్డేండ్ల శ్రీనివాస్, పల్లపు మహేష్, ఫీట్ల సాయిలు, గండికోట రాజన్న పిట్ల శ్రీనివాస్, ఎంపీ పి ఏ రేపని భాస్కర్, గుంజ శ్రీనివాస్, బోధన్ చిరంజీవి, ఆర్మూర్ సాయిలు. నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలలోని సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు యువకులు చాలా మంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు…..