POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:44 pm Posted by : POLITICAL POWER

జాబ్ కేలండర్ వెంటనే విడుదల చేయాలి.

నిరుద్యోగులకు ఏడాదికి జాబ్ కేలండర్ విడుదల చేస్తాము అన్నమాట నిలబెట్టుకోవాలి.

 డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని..

పొలిటికల్ పవర్ టివి తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఏడాదికి నిరుద్యోగులందరికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాట ఏమైందని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ లు హాజరైనారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లోకేష్ బాబు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి ఊరు వాడ తిరుగుతూ నిరుద్యోగులందరికీ నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చదువుకున్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పైబడి అవుతున్న ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని గంపడాస్తో ఎదురుచూస్తున్నారని కానీ ఒక్క ఏడాది కూడా జాబ్ కేలండర్ ఇచ్చినటువంటి పాపాన పోలేదన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువతీ యువకులు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి జీవిస్తున్నారు చాలామంది ఉద్యోగాలు రావని నిరాశ పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉందన్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం డివైఎఫ్ఐ మహిళా కన్వినింగ్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. బద్వేల్ డివైఎఫ్ఐ మహిళా పట్టణ కన్వీనర్ గా :షేక్ ఫాతిమా.పట్టణ కో కన్వీనర్లుగా.: నాగేశ్వరి, అరుణ పట్టణ కమిటీ సభ్యులుగా: నాగరత్నమ్మ, మాధవి కృష్ణవేణి గౌసియా రిజ్వాన ఆయుష పద్మ లక్ష్మీదేవి ఖాదర్ బి లను కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది