
– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 31.2026.
జిల్లాలోకురుస్తున్నవర్షాలనేపథ్యంలోఅధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు, రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎలాంటిఇబ్బందులుకలగకుండాఅన్నిశాఖలఅధికారులుసమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు తమ తమ కేంద్ర కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, కంట్రోల్ రూమ్‌లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాల వారీగా కురిసిన వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, చేపట్టిన సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నదుల పరిసర ప్రాంతాల్లోకి పశువుల కాపరులు, మత్స్యకారులు, ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తహసీల్దార్లు తమ తమమండలాల్లో అందుబాటులోఉండాలని ఆదేశించారు.ప్రజలకుఏవిధమైనఇబ్బందులు తలెత్తిన వెంటనే సహాయక చర్యలు అందించాలనిసూచించారు.ఈసమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.