POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 1:58 pm Posted by : POLITICAL POWER

జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఐ టి టవర్ నిర్మాణ పనులు నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 23.2026. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఐ టి టవర్ నిర్మాణ పనులు నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.శనివారం ఉదయం నాగవరం వద్ద రెండు ఎకరాల స్థలంలో రూపాయలు 22 కోట్లతో నిర్మిస్తున్న నూతనఐటీటవర్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు.
కలెక్టర్ నిర్మాణంలో ఉన్న పనులను పర్యవేక్షించడమే కాకుండా పూర్తి భవనము ఏ విధంగా ఉంటుంది అంతస్తులలోఉంటుందిదానికిఎలివేషన్,ఎలాఉంటుంది అనే అంశాలను ఇంజనీరింగ్ అధికారులను చిత్రపటం ద్వారా పరిశీలించారు నిర్మాణ పనులు నాణ్యత తో పాటు వేగవంతంగా పూర్తి చేసి ఏప్రిల్ 2027 నాటికిఅప్పగించేవిధంగాచూపాలనికాంట్రాక్టరు ను ఆదేశించారు. ఏప్రిల్ 2026 లో అగ్రిమెంట్ చేసుకున్న ప్రతాప్ రెడ్డి కొండా ఏజెన్సీ సంవత్సరం కాలవ్యవధి లో పూర్తి చేసి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. గడువునాటికి పూర్తి చేసేందుకు ఏ సమయం వరకు ఎంతవరకు పని చేస్తారో ఒక గ్రాండ్ చాట్ తయారుచేసి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇచ్చిన చార్ట్ ప్రకారం సమయానికి పనులు జరిగాయా లేదాఅనేదిపరిశీలిస్తామనితెలియజేశారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక, గ్రావెల్ వంటివి ఏమైనా సమస్యలుఉంటేతనదృష్టికితీసుకురావాలని అంతేతప్ప అవి దొరకడం లేదని పనులు ఆపవద్దని ఆదేశించారు.జోనల్ మేనేజర్ జ్యోతి, డి.ఈ సుబ్బారావు, తహసిల్దార్ రమేష్ రెడ్డి వి ఆర్ కొండ కాంట్రాక్టర్ నుండి సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.