జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల-మోజర్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు మాట్లాడుతూ... యోగా ద్వారా శరీరం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు....