జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజర్ల లో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల-మదిగట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సెక్టోరియల్ అధికారి శేఖర్, మండల విద్యాధికారి మంజులత కూడా పాల్గొన్నారు. అతిథులు పాఠశాలకు చేరుకోగానే ప్రధానోపాధ్యాయులు...