POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 3:04 pm Posted by : POLITICAL POWER

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రొ, జయశంకర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి ఐపీఎస్

– తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం,జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి,

– జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి, ఐపీఎస్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 07.2026.

తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం,జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి, ఐపీఎస్ అన్నారు.గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో  తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, వివిధ విభాగాల పోలీసు సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.ఆయన తెలంగాణ కోసం చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ.సునీత రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన సిద్ధాంతపరమైన పునాది వేసినమహోన్నతవ్యక్తిప్రొఫెసర్.కొత్తపల్లిజయశంకర్,అనికొనియాడారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, సమానఅభివృద్ధికోసంజీవితాంతంఅహర్నిశలుకృషిచేసినమహనీయుడిగాఆయనచరిత్రలోచిరస్థాయిగానిలిచిపోయారని పేర్కొన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత, దూరదృష్టి నేటి తరానికిస్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజం పట్ల బాధ్యత, నిజాయితీ, సేవాభావం, ప్రజా సంక్షేమం వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. జయశంకర్ గారి ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా కర్తవ్య నిర్వహణలో నిబద్ధతతోపనిచేయడంద్వారాఆయనకునిజమైననివాళిఅర్పించినవారమవుతామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసంప్రతిఒక్కరూతమవంతుబాధ్యతనునిర్వర్తించాలనిపిలుపునిచ్చారు.మహనీయులజీవితాలనుఆదర్శంగా తీసుకొని యువత దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, జిల్లాపోలీసుకార్యాలయం ఏ ఓ, సునంద, వనపర్తి సీఐ, సుగంధ రత్నం, సిసిఎస్ సీఐ, అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, వినోద్, పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.