– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మహాగణపతి ఆశీస్సులు అందించాలి,
– వనపర్తి సీఐ, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.సెప్టెంబర్.15.2026.జిల్లా ప్రజలకు,పోలీసులకుఆయురారోగ్యాలుకలగాలనిగణనాథునికిప్రార్థనలు, ప్రజారక్షణలోఅంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మహాగణపతి ఆశీస్సులు అందించాలని,వనపర్తి సీఐ, సుగంధ రత్నం,రిజర్వ్,ఇన్‌స్పెక్టర్,శ్రీనివాసులుఅన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాపోలీసుశాఖఆధ్వర్యంలోజిల్లాపోలీసుకార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయప్రాంగణంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథునికివినాయకనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి సీఐ, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, పోలీసు అధికారులు, సిబ్బంది వినాయక మండప నిర్వాహకులు కలిసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు వినాయకుడు జిల్లా పోలీసలకు, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి కార్యం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజల రక్షణ కోసం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నందున, వారి కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు ఎదురుకాకుండా ధైర్యం, శక్తి, మానసిక ప్రశాంతత ప్రసాదించి, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు నెలకొనేలా మహాగణపతి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర సోదరభావం, ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూపోలీసుశాఖకు సహకరిస్తూశాంతిభద్రతలపరిరక్షణలోభాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ పూజా కార్యక్రమంలో వనపర్తి సీఐ, సుగంధరత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి రూరల్ ఎస్సై, హృషికేష్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, వినోద్, మగ్దుం భారీ, ట్రాఫిక్ ఎస్సై, సురేందర్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, గోవింద్, పోలీసు అధికారులు, సిబ్బంది, వినాయక మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

