POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 4:56 pm Posted by : POLITICAL POWER

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి బీసీ పొలిటికల్ జెఎసి విజ్ఞప్తి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: వైద్యులు అంటేనే భగవత్ స్వరూపుడైన నారాయణ స్వామితో సమానమని బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నూతనంగా నియమితులైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ను బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్ నాయుడు మాట్లాడుతూ…. అన్ని వృత్తులలో కెల్లా వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, అలాంటి వైద్య వృత్తిలో జిల్లా అధికారిగా నియమితులైన డాక్టర్ భాస్కర్ నాయక్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను, వైద్య సిబ్బందిని సమన్వయం చేసి ఎలాంటి సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని కోరారు. ప్రజలకు మంచి చేసే ప్రతి అధికారిని బీసీ పొలిటికల్ జేఏసీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, పట్టణ అద్యక్షుడు దేవర శివ, శ్రీరంగావూర్ మండల అద్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి ఆస్కని రమేష్, నిప్పు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.