ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.. ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా చర్యలు

📰 Generate e-Paper Clip

కర్ణాటక బయలుదేరనున్న మంత్రులు, ఎమ్మెల్యేల బృందంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 22 2026: జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక్క ఎకరం భూమి కూడా ఎండిపోకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రస్తుత పంటలకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కు లేఖ రాసి, తెలంగాణలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల పరిధిలోని పంటలను కాపాడేందుకు రోజుకు 5,000 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కృష్ణా నీటిని నియంత్రితంగా విడుదల చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నాలుగు సాగునీటి పథకాల ద్వారా తెలంగాణలో సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పంటలకు కీలకమైన దశ కావడంతో సకాలంలో నీరు అందించడం అత్యంత అవసరమని, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలను వివరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

కర్ణాటక బయలుదేరనున్న మంత్రులు ఎమ్మెల్యేల బృందం

సాగునీటి విడుదలపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ల బృందం మంగళవారం రోజు హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో సాగునీటి సమస్య పరిష్కారానికి రాత్రి లేదా రేపు పొద్దున నువ్వు అన్నదాతలందరికి శుభవార్త అందనిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. “రైతులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దు. పంటలు చేతికొచ్చే వరకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సాగునీటిని సమకూర్చేందుకు కృషి చేస్తోందనీ జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడటమే ప్రభుత్వ మా ప్రధాన లక్ష్యం” అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.

Latest Articles

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై...

లింగారెడ్డి పల్లె ఎస్డబ్ల్యుపిసి కేంద్రం నందు వానపాములు విడుదల

 ... కలసపాడు సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య...

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.

అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది. యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల...

Related Articles

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బ్రేకింగ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర...

*ఫార్మా దోపిడీపై  అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ప్రాణాలు కాపాడే మందులా? రోగులను నిలువునా దోచే వ్యూహాలా?క్యాన్సర్......
error: Content is protected !!