POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 8:28 pm Posted by : POLITICAL POWER

జూలూరుపాడులో ఘనంగా గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం. సామాజిక సమరసతతోనే జాతీయ సమైక్యతకు బలమైన పునాది: అప్పాల ప్రసాద్ జీ.

జూలూరుపాడు: నవంబర్ 07: పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిన్9 తెలుగు న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలో. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో. మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరై మార్గదర్శనం చేశారు.

13 గ్రామాల నుంచి వివిధ కుల సంఘాలకు చెందిన పెద్దలు, ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గ్రామాల్లో అంటరానితనం, వివక్షత పూర్తిగా తొలగినప్పుడే జాతీయ సమైక్యతకు బలమైన పునాది పడుతుందని అప్పాల ప్రసాద్ జీ అన్నారు.

గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాల పెద్దలు పరస్పరం కలిసి కూర్చొని, దేవాలయ ప్రవేశం, పండుగలు, సామాజిక కార్యక్రమాలను ఎలాంటి హింస, ద్వేషాలకు తావులేకుండా ఐక్యంగా నిర్వహించాలని సూచించారు. వివిధ కుల సంఘాల పెద్దలు తమ తమ సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూనే, ఇతర సామాజిక వర్గాలతో స్నేహభావంతో కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న తీరు అభినందనీయమన్నారు.

అన్ని సామాజిక వర్గాలు పరస్పర స్నేహభావంతో కలిసి పనిచేయడం జాతీయ సమైక్యతకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, తమ అనుభవాలను వివరించారు.

అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ “ఒకే దేశం – ఒకే ప్రజ” అనే భావనతో జాతీయ స్థాయిలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య పరస్పర గౌరవం, సోదరభావం, సహకారం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశ సామాజిక చరిత్రను ప్రస్తావిస్తూ, బ్రిటిష్ పాలనలో “విభజించి పాలించు” విధానం ద్వారా భారత సమాజంలోని విభజనలను మరింత పెంచే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. నేటి యువత కుల వివక్షకు తావులేకుండా స్నేహభావంతో ముందుకు సాగుతూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలను అప్పాల ప్రసాద్ జీ శాలువాలతో సన్మానించి. అభినందించారు

ఈ కార్యక్రమంలో సంచార యాత్ర రాష్ట్ర అధ్యక్షులు స్వర్ణ కుమార్, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, సోడె శ్రీరాములు, చిలుకూరి రమేష్, రోకటి రంగారావు, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, మద్దిబోయిన నాగరాజు, రామిశెట్టి నాగేశ్వరరావు, బుడుగు వీరస్వామి, భూక్య రమేష్, తెల్లం నరసింహారావు, ఇర్పా రామారావు, కాలం నరసింహారావు, మడి రవి, తదితరులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.