జూలూరుపాడులో ఘనంగా గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం. సామాజిక సమరసతతోనే జాతీయ సమైక్యతకు బలమైన పునాది: అప్పాల ప్రసాద్ జీ.

జూలూరుపాడు: నవంబర్ 07: పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిన్9 తెలుగు న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలో. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో. మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరై మార్గదర్శనం చేశారు. 13 గ్రామాల నుంచి వివిధ కుల సంఘాలకు...