POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 7:38 pm Posted by : POLITICAL POWER

జూలూరుపాడు మండలంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి బి. నాగలక్ష్మి విస్తృత పర్యటన

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) బి. నాగలక్ష్మి జూలూరుపాడు మండలంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( ఎస్ ఐ ఆర్) కార్యక్రమం అమలు తీరును మాచినపేట తండా, అన్నారుపాడు మరియు పాపకొల్లు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్లస్టర్ లెవల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఆమె ఈ కార్యక్రమం పురోగతిని సమీక్షించి, ఓటర్లతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని విలేజ్ ఆర్గనైజేషన్ (వి ఓ ) భవనాల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన డ్రైన్ల ఎండ్ సోక్‌పిట్లను పరిశీలించి, వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. పాపకొల్లు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా నిర్మించిన గ్రావెల్ రోడ్డును పరిశీలించారు. అలాగే జూలూరుపాడు గ్రామపంచాయతీలో చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమాన్ని పరిశీలించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఈఓ. ప్రారంభించాల్సిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, కొనసాగుతున్న పనులను నాణ్యతతో త్వరగా తరగతులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో మండల పరిషత్ అభివృద్ధి ఎంపిడిఓ తాళ్లూరి రవి మండల పంచాయతీ అధికారి తులసి రామ్, ఏపీవో రామారావు, పి ఆర్ఏ ఈ నవీన్ కుమార్, గ్రామపంచాయతీ సర్పంచులు గ్రామపంచాయతీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.