జూలూరుపాడు మండలంలో రైతులకు పంట కుంటలపై అవగాహన కార్యక్రమం

పొలిటికల్ పవర్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పుళ్ళుడు తండా (వెనక తండా), బొజ్జ తండా గ్రామపంచాయతీల పరిధిలో రైతులకు పంట కుంటల (ఫార్మ్ పాండ్స్) ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాళ్లూరి రవి, వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్ రైతులతో కలిసి నేరుగా పంట పొలాలను సందర్శించి పంట కుంటల నిర్మాణం, వాటి ప్రయోజనాలపై వివరించారు. ప్రస్తుత వర్షపాతం పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో పంట...