POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:33 pm Posted by : POLITICAL POWER

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై. సిపిఐ మండల సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, కరువు ప్రభావిత ప్రాంతాల గుర్తింపులో జూలూరుపాడు మండలాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని వ్యవసాయ పరిస్థితులనక్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, అర్హత ఉన్న ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రైతుల జీవనోపాధికి సంబంధించిన ఇంత కీలకమైన అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని అన్నారు.