జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత. * జిల్లా వ్యాప్తంగా 2,155 మంది పోలీసులతో పటిష్ట భద్రత.  – ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా… అదనపు బలగాల మోహరింపు. – సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ. – ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: … కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ .

    పొలిటికల్ పవర్ ప్రతినిధి   కర్నూలు జిల్లా దస్తగిరి పి నవంబర్ 5 న కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసిందని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు బుధవారం తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీగారు పిలుపునిచ్చారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు 4...