పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 27.2026.మానవత్వానికి ప్రతీకగా,తన నిస్వార్థ సేవతో కోట్లాది హృదయాలను తాకిన కరుణామూర్తి,నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, భారతరత్న మదర్ తెరిసా 116 వ జయంతి సందర్భంగా జె.ఎస్.రాములు ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ని బైపాస్ రోడ్డులో గల మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరంప్రభుత్వఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెరిసా తన జీవితాన్ని పేదలు, అనాథలు,నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికిసేవచేయడానికే అంకితం చేశారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆమె సేవా స్ఫూర్తిని ఆదర్శంగాతీసుకునిసమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, అవసరమైనవారికితమవంతుసహాయంఅందించాలనేఉద్దేశంతోఈకార్యక్రమాన్నినిర్వహించడంజరిగిందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ కౌన్సిలర్ ఎన్.జె. బోయేజ్, మాజీ వార్డు సభ్యులు సుభాష్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి.నిక్సన్, జె.ఎస్.ఆర్.ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు జె.భక్తరాజు, జే.అమృతరాజు,జె.మహిమరాజు,సతీష్ రాజు,కర్ణకుమార్,పాస్టర్లునతానియల్,సుందర్,మరియు ఆసుపత్రి సిబ్బంది నాగమణి,ఆశా కార్యకర్తలు భాగ్యమ్మ,పుష్పలత,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.