POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 9:09 pm Posted by : POLITICAL POWER

జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం

 

తొస్సిపూడిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పర్యటన

జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాతకు మద్దతుగా ప్రచారం

బిక్కవోలు మండలంలోని తొస్సిపూడి గ్రామంలో మంగళవారం కురుస్తున్న జోరువానను సైతం లెక్కచేయకుండా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిక్కవోలు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొవ్వూరి సుజాత వెంకటరామారెడ్డిని, తొస్సిపూడి ఎంపీటీసీ అభ్యర్థి తేతలి శ్రీనివాస్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన సాగించారని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేశారని గుర్తుచేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.