– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులుగా అదనపు బాధ్యతలు,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.04.2026.టీ-10 క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రముఖన్యాయవాదిమునగారికృష్ణనియమితులయ్యారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులుగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.ఈ మేరకు టీ-10 క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మారపెల్లి కుమార్ అక్టోబర్ 28, 2026న అధికారిక నియామక ఉత్తర్వులను జారీ చేశారు.తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా టీ-10 క్రికెట్ క్రీడను అభివృద్ధి చేయడం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రికెట్ పోటీలనునిర్వహించడం వంటి లక్ష్యాలతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునగారి కృష్ణ న్యాయవాది మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలను అప్పగించిన టీ-10 క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మారపెల్లి కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో టీ-10 క్రికెట్ క్రీడను విస్తరించేందుకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడాప్రతిభనువెలికితీసేందుకు ప్రత్యేక కృషి చేస్తానని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో క్రికెట్, క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా టీ-10 క్రికెట్ పోటీలను నిర్వహించి, గ్రామీణ క్రీడాకారులకు తగిన గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువజన సంఘాలు, క్రీడా నిర్వాహకులు అందరూ సహకరించి తెలంగాణ రాష్ట్రంలో టీ-10 క్రికెట్ అభివృద్ధికి తోడ్పడాలని మునగారి కృష్ణ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
కోరారు.
