POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 11:03 pm Posted by : POLITICAL POWER

టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్‌గా మొగిలి సత్యారెడ్డి నియామకం

మాజీ సర్పంచ్ గట్టు మన్యం హర్షం.. ప్రత్యేక అభినందనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మీడియా విభాగంలో కీలక మార్పులు చేపడుతూ పలువురు నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొగిలి సత్యారెడ్డిని తెలంగాణ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. మొగిలి సత్యారెడ్డి గతంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, వనపర్తి డీసీసీ కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఈ నియామకంపై మోజర్ల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు మన్యం హర్షం వ్యక్తం చేశారు. మొగిలి సత్యారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మీడియా రంగంలో పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మొగిలి సత్యారెడ్డి కృషి చేయాలని గట్టు మన్యం ఆకాంక్షించారు.