పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 10 2026: హైదరాబాద్ టీపీసీసీ సోషల్ మీడియా నూతన చైర్మన్‌గా నియమితులైన నవీన్ పెట్టెం, రాష్ట్ర కన్వీనర్‌గా నియమితులైన ఉజ్వల్ రెడ్డి, రాష్ట్ర కో-ఆర్డినేటర్లుగా నియమితులైన విష్ణువర్ధన్ రెడ్డి, అంబాల శివకుమార్, అబిద్ అలీ, రామ్ లక్ష్మణ్ లను గాంధీభవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులకు అభినందనలు తెలియజేసి, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మాజీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఎం. దేవన్న యాదవు తో పాటు పలువురు సహచర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.