POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 5:14 pm Posted by : POLITICAL POWER

ట్రంప్ కు మోడీ లొంగుబాటు తోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్

మోడీ క్విట్ ప్రోకో పాలసీతో ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు వేశారు.

 కేంద్ర, రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి.  

బిజెపి, ఎన్.డి.ఏ. కూటమి ఎన్నికల వాగ్దానం ధరల స్థిరీకరణ నిధి విస్మరించారు. 

కడప కలెక్టరేట్ ఎదుట వామపక్షాల నిరసన ఆందోళన. 2026 జూన్ 9వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుండి, కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట కడప జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలకు నిరసనగా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ట్రంపు టారిఫ్ సుంకాన్ని వ్యతిరేకించలేక లొంగిపోయారని, చౌకగా వస్తున్న రష్యన్ ఆయిల్ ను దిగుమతి చేసుకోలేదని విమర్శించారు. మోడీ బిజెపి, ఎన్డీఏ గవర్నమెంట్ గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాలు ఆలమిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్, టిడిపి, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం కే.జీ. బేసిన్లోని గ్యాస్ నిక్షేపాల్లో 50 శాతం రాష్ట్ర వాటాను కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకుని రాలేకపోయారని, రాష్ట్ర విభజన చట్టం హామీలు ఏ ఒక్కటి కూడా కేంద్రం నుండి రాబట్టుకోలేకపోయారని, కాక్రోచ్ యువత వేసే ప్రశ్నలు కూడా బిజెపి, ఎన్డీఏ మిత్ర పక్షాలు బిజెపి ని ప్రశ్నించలేకున్నాయని ఎద్దేవా చేశారు. ఎస్.ఐ.ఆర్, నీటు, సీ.బీ.ఎస్.ఈ. అవకతవకలు, అవినీతి తేటతెల్లమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా, కేంద్ర ఎన్నికల కమిషన్ తొలగింపు పైన ఎటువంటి చర్యలు లేవని గుర్తు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ.. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యవసర వస్తువుల ధరలు అనివార్యంగా పెరిగాయని, ఆయిల్ నిలువలు ముందుగా సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉన్నా అమెరికా ఒత్తిడితో సమకూర్చుకోలేక పోయిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక ఉందని అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఎం.పీ.లను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించే పనిలో నిమగ్నమయ్యారని ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. సిపిఐ (ఎం.యల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పార్లమెంటులో, రాజ్యసభలో ప్రతిపక్షాలను బలహీనపరచడం ప్రజాస్వామ్యక గొంతును నొక్కడం చేస్తున్నారని ఇది చాలా ప్రమాదకరమైన చర్య అన్నారు. ఆర్.ఎస్.పి జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంబానీ, ఆదానిలకు ప్రజా సంపదను దోచి పెడుతోందని ఆరోపించారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి జయవర్ధన్ మాట్లాడుతూ.. ఓట్ చోరీ పైన ఉన్న శ్రద్ధ ప్రజల నిత్యవసర ధరల స్థిరీకరణ నిధి ఏర్పాట్లపై పెట్టి ఉంటే ప్రజలకు కొద్దిపాటి ఉపశమనం కలిగి ఉండేదని అన్నారు. సి.ఎం.పి. జిల్లా కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగం ధరల పెరుగుదల లాంటి ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక ప్రభుత్వంగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్.డి.ఏ. గవర్నమెంట్స్ ఉందని అన్నారు. సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ రాము మాట్లాడుతూ.. గతంలో ఇందిరాగాంధీ నియంతృత్వ పరిపాలన ప్రజలు చూసి గుణపాఠం చెప్పారని, త్వరలోనే బిజెపి మోడీ పరిపాలనపై ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.అన్వేష్, ఏ.రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జకరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, జె.వి.వి. జిల్లా కార్యదర్శి శివరాం, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణారెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు నాగ సుబ్బారెడ్డి, వేణుగోపాల్, కడప నగర కార్యదర్శి వెంకట శివ, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, మద్దిలేటి, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్, సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ఆర్.ఎస్.పి, ఫార్వర్డ్ బ్లాక్, సి.ఎం.పి., వామపక్ష పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.