POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 9:26 pm Posted by : POLITICAL POWER

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠాను పట్టుకున్న కొత్తకోట పోలీసులు


– వనపర్తి జిల్లా డీఎస్పీ బాలాజీ, సీఐఓడిరమేష్,ఎస్సై.ఎం.విక్రంతో కలిసిగురువారంవిలేకరులసమావేశం,
పొలిటికల్.పవర్.తెలుగుదినపత్రిక పీఎన్ 9టివి తెలుగు న్యూస్ వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ ఆగస్టు 27.2026. వనపర్తిజిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో వనపర్తి జిల్లా డీఎస్పీ బాలాజీ, సీఐ ఓడి రమేష్, ఎస్సై. ఎం.విక్రంతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకుపాల్పడుతున్నముఠానుకొత్తకోటపోలీసులుపట్టుకున్నారని, విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామునరెండు గంటలప్రాంతంలోకొత్తకోటపోలీస్‌స్టేషన్ పరిధిలోని కానాయపల్లి గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి ప్రయత్నిస్తున్ననిందితులనుపోలీసులుఅదుపులోకితీసుకున్నారు.ఎస్సై. ఎం.విక్రం ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనాస్థలానికిచేరుకునిముఠానుచుట్టుముట్టగా,ఐదుమందినిందితులు వాహనాలను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. పలు జిల్లాల్లో 23కు పైగా చోరీలు పోలీసుల విచారణలో నిందితులు గత ఎనిమిది నెలలుగా వివిధ జిల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.వనపర్తిజిల్లాలో9,మహబూబ్‌నగర్ జిల్లాలో 5, గద్వాల జిల్లాలో 4, నారాయణపేట జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2 కేసులకు సంబంధించి మొత్తం 23కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లనుచోరీచేసినట్లునిందితులు అంగీకరించారని, వీరి నుంచి 2 లక్షలరూపాయలురికవరీచేసినట్లు డీఎస్పీ తెలిపారు .

చోరీకి పాల్పడుతున్న ముఠా..

ముఠాలోని ఎ-1డాకూరిపెద్దలింగన్న అలియాస్.డక్కలిలింగా,ఎ-2మహంకాళి కిషోర్ ముందుగా బైక్‌లపై వివిధప్రాంతాల్లోతిరుగుతూట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రదేశాలను గుర్తించి రెక్కీ నిర్వహించేవారని అనంతరం రాత్రి సమయంలో బజాజ్ ట్రాలీ ఆటో, టాటాఏస్.ట్రాలీఆటో,బైక్‌లపైమిగతానిందితులతో కలిసి అక్కడికి చేరుకునేవారు.ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా చేసే జంపర్ వైర్లనుకట్.చేసినఅనంతరం,వెంటతెచ్చుకున్నపనిముట్లతోట్రాన్స్‌ఫార్మర్‌నుతెరిచిఅందులోనికాపర్,కాయిల్‌నుతొలగించేవారనివిచారణలోవెల్లడైనట్లుపోలీసులు తెలిపారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో సుమారు 40నుంచి 45కిలోలవరకుకాపర్,కాయిల్,ఉంటుందని నిందితులు తెలిపినట్లు పేర్కొన్నారు.కిలోరూ.200కువిక్రయం చోరీ చేసిన కాపర్ కాయిల్‌ను గుర్తుతెలియనివ్యాపారులకుకిలోకు సుమారురూ.200చొప్పునవిక్రయించేవారని పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఎ -1, ఎ -2 వద్ద ఉంచుకుని, మిగిలిన మొత్తాన్నిముఠాసభ్యులుసమానంగాపంచుకునేవారనివిచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్సై. ఎం విక్రం, భాస్కర్, ను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో కొత్తకోట సిఐ ఓడి. రమేష్, ఎస్సై.ఎం.విక్రం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.