POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:59 pm Posted by : POLITICAL POWER

ట్రాఫిక్ ఆర్‌.ఎస్.ఐ (RSI) శ్రీ ఎస్. శ్రీకాంత్ మరియు వారి సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

రహదారులపై గుంతలను పూడ్చి, ప్రయాణికులకు రక్షణ కల్పించిన ట్రాఫిక్ పోలీసులను అభినందించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా, ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను స్వయంగా పూడ్చి ప్రయాణికులకు రక్షణ కల్పించిన ట్రాఫిక్ ఆర్‌.ఎస్.ఐ (RSI) శ్రీ ఎస్. శ్రీకాంత్ మరియు వారి సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతతో వాహనదారుల భద్రత కోసం శ్రమించిన ఆర్‌.ఎస్.ఐ శ్రీకాంత్ చొరవ ఎంతో ప్రశంసనీయమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, విశేష సేవలు అందిస్తున్న కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది యావత్ బృందాన్ని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.