POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 9:17 pm Posted by : POLITICAL POWER

ట్రాఫిక్ ఏఎస్ఐ శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విరన్

ఎన్విఆర్ టీవీ పొలిటికల్ పవర్ తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ 30.07.2026: ద్రాచలం ట్రాఫిక్ ఏఎస్ఐ శంకర్ కుమారుడు హరీష్ కు బ్రెయిన్ స్ట్రోక్ తో హఠాన్మరణం చెందాడు. అది తెలుసుకున్న శ్రీ కాశీ విశ్వనాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పరామర్శించారు. ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం వీరన్, కన్వీనర్ దేవేందర్ లు శంకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుమారుడు హరీష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం విరన్ మాట్లాడుతూ… “ప్రజల రక్షణ కోసం రోడ్లపై ఎండ, వాన అనకుండా విధులు నిర్వహించే పోలీసుల త్యాగం గొప్పది. ఏఎస్ఐ శంకర్ కూడా తన విధిని చిత్తశుద్ధితో నిర్వర్తించారు. అటువంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం అని ఆయన మాట్లాడారు. శంకర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం వీరన్, కన్వీనర్ దేవేందర్