POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 8:50 pm Posted by : POLITICAL POWER

డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న సుక్కమ్మ బస్తి…పండుగ వాతావరణం లో విపరీతమైన చెత్త దుర్గంధం వాసనతో భక్తుల తిప్పలు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ మున్సిపాలిటీ ప్రాంతంలో బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న, జాతర సమయంలో సుక్కమ్మ కుంట ప్రాంతం అపరిశుభ్రతతో కూడిన డంపింగ్ యార్డ్ ప్రాంతంగా దర్శనమిస్తోంది. విపరీతంగా పేరుకుపోయిన ఈ చెత్తను తొలగించాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చెత్త తొలగింపు విషయంలో నిర్లక్ష్యం వహించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన ఈ చెత్త నుండి దుర్గంధపు వాసన విరజిమ్మడంతో పాటు ఈగలు, దోమలు, క్రిమి కీటకాలకు ఆవాసంగా మారి స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకొని చెత్తను తొలగించి స్థానికులు అనారోగ్యాల బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని లేనియెడల తాగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.