డిగ్రీ విద్యార్థులకు సువర్ణావకాశం – గురుకుల డిగ్రీ కళాశాలలో ఉచిత ప్రవేశాలు ప్రారంభం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 07 2026: దేవరకద్ర, జూన్ 7: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (బాలురకు), చౌదర్‌పల్లి గ్రామం, దేవరకద్ర మండలంలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలను ప్రారంభించింది. పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ కళాశాల ఎస్‌వీఐటీఎస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో కొనసాగుతోంది. కళాశాలలో ఇంగ్లీష్ మాధ్యమంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో...