డిగ్రీ విద్యార్థులకు సువర్ణావకాశం – గురుకుల డిగ్రీ కళాశాలలో ఉచిత ప్రవేశాలు ప్రారంభం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 09 2026: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (బాలురకు), చౌదర్‌పల్లి గ్రామం, దేవరకద్ర మండలంలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలను ప్రారంభించింది. పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ కళాశాల ఎస్‌వీఐటీఎస్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గరలో గల ప్రక్కన బిల్డింగ్ లో కొనసాగుతోంది. కళాశాలలో ఇంగ్లీష్ మాధ్యమంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి....