POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 9:11 pm Posted by : POLITICAL POWER

డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2, 3, తేదీలలో జయప్రదం చేయండి.

హలో యువత చలో నెల్లూరు 1,2,3, తేదీలలో తరలిరండి..

డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా ఎం వెంకటేష్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ నెల 1,2,3 నెల్లూరులో ఘనంగా జరగబోతున్నాయని ఈ మహాసభలకు యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పిలుపునిచ్చారు. ఆదివారం నాడు బద్వేల్ పట్టణంలో డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ లతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ….. యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారథి డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలో సెప్టెంబర్1,2,3 వా తేదీలలో నెల్లూరు నగరంలో జరుగుతున్నాయని అన్నారు మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలపై చర్చిస్తామని అన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు అందరికీ విద్య అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు అన్నారు రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కలిగించాలని అన్నారు స్థానిక పరిశ్రమంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు ఈ డిమాండ్లన్నీ రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు కావున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు