POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 9:34 pm Posted by : POLITICAL POWER

డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన చింతలపల్లి పాల పుల్లయ్య

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక /పిఎన్9 టీవీ కడప జిల్లా జూన్ 17 2026: బద్వేల్ నియోజకవర్గం, కలసపాడు మండలం, చింతలపల్లి గ్రామానికి చెందిన పాల పుల్లయ్య ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాల పుల్లయ్య చింతలపల్లి గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై చైర్మన్ తో చర్చించారు. అనంతరం డీసీసీ బ్యాంక్ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవలపై చైర్మన్ కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల సుధాకర్,చెరుకూరి రవి కుమార్ నాయుడు,కలసపాడు మండల నాయకులు కొత్తకోట సొసైటీ చైర్మన్ కల్లూరు దుగ్గిరెడ్డి,పామూరు బాలిరెడ్డి ,తదితర నాయకులు పాల్గొన్నారు.