POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:14 pm Posted by : POLITICAL POWER

డెల్టా రైతుల పాలిట అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ -సబ్బెళ్ళ కృష్ణారెడ్డి*

 

పొలిటికల్ పవర్ జాతీయతెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే15:

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: డెల్టా ప్రాంత ప్రజలకు స్వర్గీయ సర్ ఆర్థర్ కాటన్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం రామవరం గ్రామంలో గ్రామ వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్ నల్లమిల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సబ్బెళ్ళ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ధవలేశ్వరం ఆనకట్ట నిర్మాణం ద్వారా గోదావరి జిల్లాల బీడు భూములకు సాగునీరు అందించి పచ్చని పంట పొలాలుగా మార్చిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని కొనియాడారు. గోదావరి డెల్టా శిల్పిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కాటన్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
2001 సంవత్సరంలో అప్పటి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు స్వర్గీయ సత్తి వీర్రెడ్డి ప్రోత్సాహంతో రామవరం గ్రామంలో కాటన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి సందర్భంగా క్రమం తప్పకుండా నివాళులు అర్పించడం తమ బాధ్యతగా కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి, రామవరం పీహెచ్సీ మాజీ చైర్మన్ గుడిమెట్ల వెంకటరెడ్డి, గ్రామ వైయస్‌ఆర్‌సీపీ సేవాదళ్ అధ్యక్షులు నల్లమిల్లి ఆదినారాయణ రెడ్డి (బాబ్జి), మాజీ పంచాయతీ పాలకమండలి సభ్యులు కర్రి రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు పులగం వెంకటరెడ్డి, సబ్బెళ్ళ శేషారెడ్డి, నల్లమిల్లి అచ్చిరెడ్డి, నల్లమిల్లి శివకోటిరెడ్డి, కొవ్వూరి ఆదిరెడ్డి, నల్లమిల్లి సూర్రెడ్డి, టేకి రాఘవ, కర్రి శ్రీనివాసరెడ్డి, చింతా ప్రభాకరరెడ్డి, పులగం శివారెడ్డి, సబ్బెళ్ళ తిరపారెడ్డి తదితరులు పాల్గొని సర్ ఆర్థర్ కాటన్‌కు ఘన నివాళులు అర్పించారు.