Date of Publish : 21 September 2026, 11:53 amPosted by : POLITICAL POWER
డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి
మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి
బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేందర్ నాయుడుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026:మదనాపూర్ పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచడం, గ్రామాల్లో నిఘా పెంచడం మరియు యువత డ్రగ్స్ కు బానిస కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మదనాపూర్ ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మహేందర్ నాయుడు మాట్లాడుతూ గ్రామాలకు కేటాయించిన పోలీస్ సిబ్బంది రోజూ గ్రామాల్లో తిరిగే విధంగా చూడాలని, గ్రామంలో ఏ సమస్య ఉంది, ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని ప్రతిష్టాత్మక కార్యక్రమం తీసుకున్నారని, కానీ మదనాపురం మండలంలో అమలు కావడం లేదన్నారు. డ్రగ్స్ కు బానిసలైన యువత… మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ ను అరికడితేనే నేరాలు తగ్గుతాయన్నారు. ఇటీవల కాలంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో యువత గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, దీనిని అరికట్టడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాని కోరారు. గ్రామాల్లో బీట్ కానిస్టేబుల్ వ్యవస్థను బలోపేతం చేసి, ఉదయం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహించి, గ్రామ పెద్దలు, యువజన సంఘాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.