Date of Publish : 26 September 2026, 1:41 pmPosted by : POLITICAL POWER
తీన్మార్ మల్లన్న పాదయాత్రకు వనపర్తి యువత మద్దతు.. తాండూర్‌లో ఘన సన్మానం
తెలంగాణ రాజ్యాధికార నినాదాలతో మార్మోగిన వాతావరణం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో సెప్టెంబర్ 26 2026:తాండూర్ గోల్కొండ కోట నుంచి కాకతీయుల కోట వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో భాగంగా తాండూర్‌లో శనివారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. పాదయాత్ర సందర్భంగా తీన్మార్ మల్లన్నను వనపర్తి జిల్లా యువత నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.సమాజం కోసం, ప్రజల కోసం యువత మరింత చురుకుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై యువతలో చైతన్యం తీసుకురావడం, తెలంగాణ హక్కులు మరియు యువత భవిష్యత్తుపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై పాదయాత్ర కొనసాగుతోందని వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా యువత నాయకులు రవికుమార్, సంతోష్ కుమార్, బాజ శేఖర్, ముమ్మల బాబు, పి. ఆంజనేయులు, ఎం. శివకృష్ణ, మూర్తి తదితరులు పాల్గొని తీన్మార్ మల్లన్నకు అభినందనలు తెలిపారు.