తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. నెమలిపేట ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే జారె
దమ్మపేట మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. దెబ్బతిన్న రహదారులు, పంట పొలాల పరిశీలన.. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట: మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. దమ్మపేట మండలంలోని దమ్మపేట, నెమలిపేట, పార్కలగండి, కొత్తూరు, పట్వారిగూడెం, దిబ్బగూడెం, జగ్గారం, అంకంపాలెం గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న రహదారులు, చెరువులు, వాగులతో పాటు వరద నీటిలో మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....